Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సిపిఐ (ఎం) ఎమ్మెల్యేల ఓట్లు బిజెపి అభ్యర్థులిద్దరి ఓటమిలో కీలకంగా మారాయి. సిపిఐ(ఎం) ఎమ్మెల్యేలు గిరిధర్‌లాల్, బల్వాన్ పునియా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేశారు. బిజెపి బలపరిచిన సైనస్ ఛానెల్ యజమాని సుభాష్ చంద్ర ఓటమిలో ఈ ఓట్లు నిర్ణయాత్మకమయ్యాయి. ముకుల్ వాస్నిక్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, ప్రమోద్ తివారీ (కాంగ్రెస్), ఘనశ్యామ్ తివారీ (బిజెపి) విజయం సాధించారు. మరోవైపు హర్యానాలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి అజరు మాకెన్‌కు వ్యతిరేకంగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటు వేయడంతో ఓటమి పాలయ్యారు. అక్కడ బిజెపి నిలిపిన కార్పొరేట్ మీడియా మొగల్ కార్తికేయ శర్మ గెలిచారు.