Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనేశ్వర్ : సుమారు 300 మంది మావోయిస్టు మిలిషియీ సభ్యులు ఆదివారం ఒడిషాలో లొంగిపోయారు. లొంగిపోయినవారంతా మల్కాన్గిరి జిల్లాలోని గన నాట్య సంఘ, గ్రామ కమిటీలకు చెందిన వారని రాష్ట్ర డిజిపి ఎస్కె బన్సాల్ తెలిపారు. వీరంతా జోదంబో పోలీస్ స్టేషన్ పరిధిలోని ధకడ్పడర్, దాబుగుడ, తబెర్, అర్లింగ్పాద గ్రామాలకు చెందిన వారు. జంత్రీలోని బిఎస్ఎఫ్ క్యాంప్ వద్దకు శనివారం మధ్యాహ్నం స్వచ్ఛందంగా వచ్చి మల్కాన్గిరి జిల్లా అధికారుల సమక్షంలో పోలీసుల ముందు లొంగిపోయారని బన్సాల్ చెప్పారు.