Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలకడగానే ఆరోగ్యం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ సంబంధ సమస్యలతో ఆమె ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ, ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రన్‌దీప్ సూర్జేవాలా వివరించారు. సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదనీ, మరి కొన్ని రోజులు ఆమె ఆస్పత్రిలో ఉండనున్నారని ఆయన ట్వీట్ చేశారు. ఈనెల 2న ఆమె కోవిడ్-19 బారిన పడిన విషయం విదితమే. నేషనల్ హెరాల్డ్-ఏజేఎల్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈనెల 8న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు ఆమె హాజరు కావాల్సి ఉన్నది. కానీ, కోవిడ్ బారిన పడటంతో ఆమె ఈడీని మరికొంత సమయాన్ని కోరారు. దీంతో ఈనెల 23న తమ ముందు హాజరు కావాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ సోనియాకు తాజాగా సమన్లు పంపింది.