Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో నిరసనకారుల ఇండ్ల కూల్చివేత
- కాన్పూర్, సహరాన్పూర్, అలహాబాద్‌లో బుల్డౌజర్తో బెదిరింపులు
న్యూఢిల్లీ: శుక్రవారం నిరసనలకు నేతృత్వం వహించినవారిని, పాల్గొన్నవారిని లక్ష్యంగా చేసుకొని ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రతికార దాడులకు తెగబడుతోంది. ఆదివారం కాన్పూర్, సహ రాన్పూర్, అలహాబాద్లలో ముస్లిం నాయకుల ఇండ్లను బుల్డౌజర్తో కూల్చివేసింది. ఇదంతా కూడా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా సాగుతోం దని ప్రకటించింది. గత శుక్రవారం (జూన్ 10న) అలహాబాద్‌లో ముస్లింల నిరసనలకు నేతృత్వం వహించిన రాజకీయ నేత జావెద్ మహమ్మద్ ఇల్లు చట్టవిరుద్ధంగా నిర్మించారని యోగి సర్కార్ ఆదివారం కూల్చివేసింది. జావెద్ ఎటువంటి అనుమతులు లేకుండా ఈ ఇంటిని నిర్మించినట్టు ప్రయాగ్‌రాజ్ అభివృద్ధి సంస్థ అధికారులు జారీచేసిన నోటీ సులో తెలిపారు. జావెద్‌కు మే నెలలోనే నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు.
ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చేయడానికి జూన్ 9 వరకు గడువు ఇచ్చినట్టు పేర్కొన్నారు. భారీ బందోబస్తు నడుమ రెండు బుల్డౌజర్లతో ఈ ఇంటిని కూల్చివేసే పనులను ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఇంట్లోని ఏసీ, కూలర్, ఫ్రిజ్ వంటి సామగ్రిని పురపాలక సంఘ సిబ్బంది బయటకు తీసుకొచ్చి..పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పెట్టారు. అనంతరం ఇంటి ప్రహారీ గోడ, తలుపులను బుల్డోజర్లతో తొలగించారు. ఇదిలా ఉండగా జావెద్ కుమార్తె అఫ్రీన్ ఫాతిమా సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధిగా నుపూర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ముస్లింలు ఆందోళనలు, నిరసనలకు దిగారు. ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్, సహరాన్పూర్, అలహాబాద్ నగరాల్లో నిరసనలు పెద్ద ఎత్తున సాగాయి. 230 మంది ఆందోళనకారుల్ని యూపీ సర్కార్ అరెస్టు చేసింది. అలహాబాద్‌లో 60మందిని పోలీసులు నిర్బంధించారు.