Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేపడుతున్న బుల్డోజర్ కూల్చివేతలు, ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో ఆదివారం ముస్లిం ఉద్యమకారుడు జావేద్ మహమ్మద్ ఇంటి కూల్చివేత పూర్తిగా చట్టవిరుద్ధమని అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గోవింద్ మాథుర్ పేర్కొన్నారు. 'ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఆ నిర్మాణం చట్టవిరుద్ధమని ప్రభుత్వం భావించినప్పటికీ, ఆ గృహ నివాసితులు నిర్బంధంలో ఉన్న సమయంలో ఆ ఇంటిని కూల్చివేయడం అనుమతించబడదు. ఇది కేవలం సాంకేతిక సమస్య మాత్రమే కాదు, రూల్ ఆఫ్ లాపై ప్రశ్న కూడా' అని ఆయన మీడియాకు తెలిపారు. నిరసనకారులు, ముఖ్యంగా ముస్లిముల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయడంపై సుప్రీంకోర్టు, అలహాబాద్, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో ప్రస్తుతం అనేక కేసులు విచారణలో ఉన్నాయి.