Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా : పశ్చిమబెంగాల్లోని అన్ని యూనివర్సిటీలకు ఛాన్సెలర్‌గా వ్యవహరిస్తున్న గవర్నర్ జగదీప్ ధన్కర్ స్థానంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని భర్తీ చేస్తూ రూపొందించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. బీజేపీ శాసనసభ సభ్యుల వ్యతిరేకత మధ్య ఈ బిల్లు ఆమోదం పొందింది. పశ్చిమబెంగాల్ యూనివర్సిటీ చట్టాల (సవరణ) బిల్లును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్యాబసు సభలో ప్రవేశపెట్టారు. 'విశ్వభారతి సెంట్రల్ యూనివర్సిటీకి వైస్‌చాన్సలర్‌గా ప్రధాని మోడీ వ్యవహరిస్తుండగా.. రాష్ట్ర యూనివర్సిటీలకు ఛాన్సెలర్‌గా మమతా ఉండకూడదా? మీరు పూంచీ కమిషన్ సిఫార్సులు పరిశీలించండి' అని విద్యా శాఖ మంత్రి తెలిపారు. గవర్నర్ జగదీప్ నుద్దేశించి మాట్లాడుతూ.. పలు సందర్భాల్లో ప్రస్తుత ఛాన్సెలర్ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించారని అన్నారు. కాగా, ఈ బిల్లుకు అనుకూలంగా 182 మంది ఓటు వేయగా... 40 మంది వ్యతిరేకించారు. కాగా, ఈ బిల్లుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రతిదీ కంట్రోల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని, చాన్సెలర్‌గా ముఖ్యమంత్రిని నియమించడం వల్ల రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థలో రాజకీయ జోక్యానికి దారి తీస్తుందని బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ ఆరోపించారు.