Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ : ఆన్లైన్ బెట్టింగ్ ఫ్లాట్ఫారమ్ల ప్రకటనలు మానుకోవాలని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చింది. అలాగే భారత్‌లో ఇటువంటి ప్రకటనలు ప్రదర్శించవద్దని లేదా భారతీయ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోవద్దని ఆన్లైన్ ప్రకటనల మధ్యవర్తులు, ప్రచురణకర్తలతో సహా ఆన్లైన్, సోషల్ మీడియాకు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్, ఆన్లైన్ మీడియాల్లో ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్లు, ప్లాట్‌ఫారమ్‌ల యొక్క ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ సలహా ఇచ్చింది.
'దేశంలోని అనేక ప్రాంతాల్లో బెట్టింగ్, జూదం చట్టవిరుద్ధం. ఇది వినియోగదారులకు ముఖ్యంగా యువత, చిన్నారులకు గణనీయమైన ఆర్థిక, సామాజిక-ఆర్థిక ప్రమాదాన్ని కలిగిస్తుంది' అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటువంటి ప్రకటనలు నిషేధించిన కార్యాచరణను ప్రోత్సహించే ప్రభావాన్ని కలిగి ఉన్నాయని తెలిపింది.
'ఆన్లైన్ బెట్టింగ్ యొక్క ప్రకటనలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. అలాగే వినియోగదారుల రక్షణ చట్టం, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్‌లోని అడ్వర్టైజింగ్ కోడ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యెక్క ప్రెస్ కౌన్సిల్ చట్టంలోని జర్నలిస్టిక్ నిబంధనలకు అనుగుణంగా లేవు' అని మంత్రిత్వ శాఖ తెలిపింది.