Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎస్పీ చట్టం తీసుకురాకపోతే కేంద్రంపై తీవ్ర పోరాటం చేస్తారు :మేఘాలయ గవర్నర్
జైపూర్ : రైతుల నిరసనలపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమం ఇంకా ముగియలేదని చెప్పారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టం తీసుకురాకపోతే భారత ప్రభుత్వంపై వారు భీకర పోరు చేస్తారని తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మేఘాలయ గవర్నర్గా తన పదవీకాలం పూర్తైతే తానూ ఆ ఉద్యమంలో పాల్గొంటానని తెలిపారు. రైతుల సమస్యలపై ఇటీవల పలు సందర్భాల్లో మోడీ ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. వివాదాస్పద సాగు చట్టాలపై రైతుల ఆందోళన కొనసాగుతున్న సమయంలో వారిపై వేదింపులు జరుగుతున్నాయన్న విషయాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వివరించారు. అదానీ మరింత సంపన్నుడిగా ఎలా కాగలుగుతున్నాడని మోడీని సత్యపాల్ ప్రశ్నించారు.