Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020లో ద్వేషపూరిత ప్రసంగాలపై...
న్యూఢిల్లీ : 2020లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల సందర్భంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, పర్వేష్ వర్మలకు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు పెట్టింది. 'మతం, కులం, జాతి ప్రాతిపదికన.. ప్రజా ప్రతినిధులు, రాజకీయ, మత పెద్దలు ఇటువంటి ప్రసంగాలు చేయడం సోదరభావానికి విరుద్ధం' అని జస్టిస్ చంధ్రదారి సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి ఈ బీజేపీ ఎంపీలపై కేసు నమోదు చేయాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. గత ఏడాది ఇదే విధమైన పిటిషన్ను తిరస్కరించిన ట్రయల్ కోర్టు ఆదేశాలను ఈ కోర్టు సమర్థించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ ధర్మాన్ని బుల్డోజ్ చేస్తున్నారనీ, స్వేచ్ఛను, సమానత్వాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ చర్యలు రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక సూత్రాలను అనుమానించడమేననీ, అందువల్ల కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాలు కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరముందని న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తంచేశారు.