Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవలం కాంగ్రెస్ వాళ్లనే ఎందుకు విచారిస్తున్నారు : రాహుల్
- కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ మార్చ్
- సీనియర్ నేతలను అడ్డుకున్న పోలీసులు
- ఎనిమిదిన్నర గంటల పాటు విచారణ...
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థలో మీ హౌదా ఏమిటి? యంగ్ ఇండియన్ సంస్థతో మీ సంబంధం ఏమిటి? మీ పేరుతో ఆ సంస్థలో షేర్లు ఎందుకు ఉన్నాయి? యంగ్ ఇండియన్ సంస్థకు కాంగ్రెస్ నుంచి రుణాలు ఎందుకు ఇచ్చారని ఈడీ ప్రశ్నించింది. విచారణ సందర్భగా రాహుల్ గాంధీ తరపున న్యాయవాదులను అనుమతించ లేదు.అయితే కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్లనే విచారణకు పిలుస్తున్నారంటూ రాహుల్ ఈడీ అధికారులను ప్రశ్నించారు. లంచ్ కోసం రాహుల్ ఈడీ కార్యాలయం విడిచిపెట్టారు. అక్కడి నుంచి నేరుగా తన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చికిత్స పొందుతున్న గంగారామ్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం మళ్లీ ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకుని రెండోసారి విచారణకు హాజరయ్యారు.ఎనిమిదిన్నర గంటల పాటు విచారణ అనంతరం రాహుల్ బయటకు వచ్చారు.
మోడీ సర్కార్ వ్యతిరేక నిరసనలు
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సత్యాగ్రహ మార్చ్ నిర్వహించింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ ర్యాలీలు జరిగాయి. ఢిల్లీలో పోలీసుల ఆంక్షలతో రణరంగంగా మారింది. 144 సెక్షన్ విధించడం, కాంగ్రెస్ సీనియర్ నేతలను అడ్డుకోవడం, రాజ్యసభ సభ్యలను చూడకుండా రోడ్డుపై ఈడ్చికెళ్లడం వంటి పోలీసుల ఓవర్ యాక్షన్ చర్యలతో టెన్షన్ నెలకొంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలను సైతం అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.
రాహుల్‌తో పాటు ఈడి కార్యాలయానికి ప్రియాంకా గాంధీ వాద్రా కూడా చేరుకున్నారు. రాహుల్ గాంధీపై కేంద్రం చర్యలను నిరసిస్తూ వందల మంది కార్యకర్తలు ఏఐసీసీ కార్యాలయం నుంచి రాహుల్, ప్రియాంక వెంట ర్యాలీగా ఈడీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే.. ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ నివాసం దగ్గర, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ దగ్గర భద్రతా చర్యల్లో భాగంగా అదనపు బలగాలు మోహరించాయి.
శాంతియుతంగా నిరసన చేస్తున్న తమ పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం ఏంటని ప్రియాంక ప్రశ్నించారు. కార్యకర్తలకు ఆమె భరోసా ఇచ్చారు. 'సత్యాగ్రV్‌ా' మార్చ్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఎంపీలు అధీర్ రంజన్ చౌదరి, కెసి వేణుగోపాల్, దీపేందర్ హుడా, జైరాం రమేష్, హరీష్ రావత్, రణదీప్ సుర్జేవాలా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మల్లికార్జున్ ఖర్గే, దిగ్విజరు సింగ్, ముకుల్ వాస్నిక్ పలువురు నేతలు ఈ నిరసనల్లో భాగమయ్యారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రాహుల్‌కు ఈడీ సమన్లు పంపడంపై కాంగ్రెస్ ఎంపి మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. ఇదంతా రాజకీయమే కానీ మరొకటి కాదని అన్నారు. కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లే దారిలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను, బారికేడ్లను ఏర్పాటు చేశారు. బుల్డోజర్లు ఒక్కటే మిస్ అయ్యాయని సెటైరికల్ కామెంట్స్ చేశారు. మైనారిటీ మతాన్ని ఆచరించే వ్యక్తులను, ఇండ్లను ధ్వంసం చేసే పనిలో బుల్డోజర్లు బిజీగా ఉండి ఉంటాయని ఘాటుగా స్పందించారు. ఈడీ, సీబీఐ దాడుల వెనుక బీజేపీదే శక్తి అని అశోక్ గెహ్లాట్ విమర్శించారు.