Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెబీకి వ్యతిరేకంగా సహారా ఆందోళన
జైపూర్ : తమ ఇన్వెస్టర్లకు రూ.25,000 కోట్లు చెల్లించడంలో సెబీ విఫలమయ్యిందని సహారా ఉద్యోగులు, ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మొత్తం తమ సంస్థకు తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ సోమవారం జైపూర్‌లో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అనంతరం బస్సి చౌక్‌లోని సెబీ రీజినల్ ఆఫీసులో తమ డిమాండ్ పత్రాన్ని అందజేశారు. బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సుప్రీంకోర్డు ఆదేశాలను అనుసరించి.. ఇన్వెస్టర్లకు రూ.25వేల కోట్లు నిధులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. సెబీ పద్దతి ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందన్నారు. సెబీ వద్ద డిపాజిట్ చేసిన రూ.25వేల కోట్లు చెల్లించకపోవడంతో 14 లక్షల మంది ఇన్వెస్టర్లు, సిబ్బంది ఆందోళనకు గురైతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.