Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం విచారణ కోసం ఈడీ ముందుకు హాజరయ్యారు. రాహుల్ వెంట ప్రియాంక గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకముందు ఏఐసీసీ కార్యాలయం వద్ద రాహుల్ గాంధీ ధర్నాలో పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు ధర్నాకు దిగిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రెండో రోజు ఈడీ విచారణ, కాంగ్రెస్ నిరసనలు కొనసాగిన నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర ఆంక్షలు విధించారు. అక్బర్ రోడ్, జన్‌పథ్ మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు.