Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉన్నత విద్యాసంస్థలు (హెచ్ఈఐలు), కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా అన్ని ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి మంత్రిగానూ ధర్మేంద్ర ప్రధాన్ కొనసాగుతున్నారు. ఈ రెండు మంత్రిత్వ శాఖలు రాబోయే ఒకటిన్నర సంవత్సరాల్లో తమ తమ శాఖల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి కట్టుబడి ఉన్నాయని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 10 లక్షల మంది ఉద్యోగులను నియమించాలనే ప్రధానమంత్రి మోడీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అన్ని మంత్రిత్వ శాఖల్లోని మానవ వనరులపై సమీక్ష నిర్వహించిన తరువాత మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.