Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవితకాలం 7.6ఏండ్లు తగ్గింది
- కాలుష్యమయమైన దేశాల్లో భారత్‌కు రెండో స్థానం : ఎయిర్‌క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక
న్యూఢిల్లీ : కాలుష్యం వల్ల ఉత్తర భారతంలో దాదాపు 51కోట్ల మంది జీవితకాలం 7.6ఏండ్లు తగ్గిందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. మనదేశంలో కాలుష్యం ప్రజలకు అతిపెద్ద ముప్పుగా మారిందని అధ్యయనం హెచ్చరించింది. యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన పరిశోధకులు రూపొందించిన 'ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్' అనే నివేదికలో పై విషయాన్ని పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం, కాలుష్యం వల్ల సగటు భారతీయుడి జీవితకాలం ఐదేండ్లు తగ్గింది.
బంగ్లాదేశ్ తర్వాత ప్రపంచంలో అత్యంత కాలుష్యం నెలకొన్న దేశంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో కాలుష్యం జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉంది. ప్రస్తుత కాలుష్య స్థాయిలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులు విడుదల చేయగా, ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమయమైన నగరంగా ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ కాలుష్యం వల్ల పౌరుల జీవితకాలం 10ఏండ్లు తగ్గే అవకాశముందని నివేదిక తెలిపింది. భారత్‌లో 130కోట్లమంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన వార్షిక సగటు కాలుష్యకారకాల స్థాయి దాటిన ప్రాంతాల్లో నివసిస్తున్నారని నివేదిక హెచ్చరించింది.