Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ఆగస్టు 12 వరకు జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్న పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిఫారసు చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 12 వరకు వర్షాకాల సమావేశాలు నిర్వహించవచ్చని తెలిపింది. రాబోయే పార్లమెంట్ సమావేశాలు 17 రోజుల పాటు పార్లమెంట్ కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంది.