Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 29 వరకు నామినేషన్ దాఖలుకు గడువు
న్యూఢిల్లీ: రాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. 16వ రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు గడువు ఈ నెల 29 వరకు ఉంది. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే నెల 2 వరకు గడువు ఉంది. పోలింగ్ వచ్చే నెల 18న జరుగుతుంది. వచ్చే నెల 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 24తో ముగుస్తుంది.