Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తైవనీస్ టెక్నాలజీ సంస్ధ అసుస్ భారత మార్కెట్లోకి తమ అతి సన్నటి, తేలికపాటి ల్యాప్‌టాప్ జెన్‌బుక్ ఎస్ 13 ఓఎల్ఈడీని విడుదల చేసినట్టు వెల్లడించింది. ఈ ల్యాప్‌టాప్ కేవలం 1.1 కిలోల బరువు ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. అంతేకాదు 14.9 మిల్లీమీటర్ల మందం కలిగి ఉంటుంది. జెన్‌బుక్ ఎస్ 13 ఒఎల్ఇడితో అసుస్ అతి సన్నటి, శక్తివంతమైన, సుదీర్ఘమైన బ్యాటరీ జీవితం కలిగి ఉంటుందని వెల్లడించింది. దీని ప్రారంభ ధర రూ.99,990గా నిర్ణయించినట్టు తెలిపింది. ఇవి ఆఫ్‌లైన్, ఆన్లైన్లో లభిస్తాయని పేర్కొంది.