Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ రోజు రోజుకు వెలవెల పోతోంది. బుధవారం సెషన్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 77.99 వద్ద ప్రారంభమై.. ఇంతక్రితం రోజు ముగింపునతో పోల్చితే మరో 13 పైసలు పతనమై 78.17కు పడిపోయింది. అధిక చమురు ధరల పెరుగుదలకు తోడు విదేశీ నిధులు తరలిపోవడం రూపాయిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. భారత స్టాక్ మార్కెట్లు వరుస పతనం, ఎఫ్ఐఐలు తరలిపోవడం, డాలర్‌కు డిమాండ్ పెరగడం తదితర అంశాలు రూపాయిని బలహీనపర్చుతున్నాయి.