Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) లేకుండానే పీహెచ్డీ చేసే అవకాశం విద్యార్థులకు దక్కనుంది. ఈ మేరకు యూజీసీ నిబంధనలు రూపొందించింది. పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి 'యూజీసీ నిబంధనలు- 2022'ను ఈ నెలాఖరున ప్రకటించనున్నారు. ఈ విధానం 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. నాలుగేండ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో 7.5/10 సీజీపీఏతో ఉత్తీర్ణులైనవారు పీహెచ్‌డీకి అర్హులని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, విభిన్న ప్రతిభావంతులకు 0.5 మేర సీజీపీఏ తక్కువగా ఉన్నా అనుమతిస్తారు. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరిన వారు పరిశోధనల వైపు మొగ్గుచూపి ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధన పరమైన వాతావరణం నెలకొల్పేందుకు ఈ నిబంధనలు తోడ్పడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.