Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లకో: బీజేపీ బుల్డోజర్లకు రాజ్యాంగం, చట్టాలు అడ్డుకట్ట వేస్తాయని సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ హెచ్చరిం చారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. శుక్రవారం నమాజ్ అనంతరం పలువురు ముస్లింలు బీజేపీ ప్రతినిధులకు వ్యతి రేకంగా ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్లో జావేద్ మహమ్మద్‌ను కీలక నిందితుడిగా ఆరోపిస్తూ.. ప్రయాగ్‌రాజ్‌లోని అతని నివాసాన్ని ఆదివారం యోగి ప్రభుత్వం కూల్చివేసింది. అయితే ఆ నివాసం అతనిది కాదనీ, అతని భార్య పేరుపై ఉందనీ, పన్నులు కూడా చెల్లించారని అఖిలేష్ పేర్కొన్నారు. ఒకవేళ అది అక్రమ కట్టడమే అయితే ప్రభుత్వం పన్నులు ఎందుకు కట్టించుకుందని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వం తన తప్పును అంగీకరిస్తుందా, బుల్డోజర్తో కూల్చివేసిన ఆ నివాసాన్ని తిరిగి అధికారులు నిర్మించి ఇస్తారా అని యోగి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం జరిగిన అల్లర్లకు సూత్రధారి అంటూ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నేత, ప్రయాగ్‌రాజ్‌లో ప్రముఖ వ్యక్తి అయిన జావేద్ మహమ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. జావేద్ భార్య పేరు మీద ఉన్న నివాసాన్ని కూల్చివేయడం చట్టవిరుద్ధమంటూ న్యాయవాదు ల బృందం అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కి రాసిన లేఖలో కూడా పేర్కొన్నారని అన్నారు.