Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రదర్శన
లాల్గఢ్ (బెంగాల్): దాదాపు 13 ఏండ్ల తర్వాత అమరవీరుల స్మృత్యర్థం లాల్గఢ్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యాన మంగళవారం ప్రదర్శన నిర్వహించారు. ఝాగ్రామ్ ఏరియాలోని లాల్గఢ్ ఏరియా కమిటీ పిలుపు మేరకు వందలాదిమంది ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో తృణమూల్ గూండాలు, మావోయిస్టులు కలసి 43మంది సీపీఐ(ఎం) కార్యకర్తలను అమానుషంగా పొట్టనబెట్టుకున్నారు. వీరిలో కేవలం నలుగురి మృతదేహాలను మాత్రమే కనుక్కోగలిగారు. మిగిలినవారి మృతదేహాలు దొరకలేదు. ఆ అమరవీరులకు నివాళిగా ఈ ప్రదర్శన నిర్వహించినట్లు లాల్ఘడ్ ఏరియా కమిటీ కార్యదర్శి అలోక్ దాస్ మీడియాకు తెలిపారు. ఇదిలా వుండగా బెంగాల్ లో అవినీతి విశృంఖలత్వాన్ని, ఆదివాసీ విద్యార్ధులకు చెందిన 72 హాస్టళ్ళను మూసివేయడాన్ని నిరసిస్తూ, వివిధ సామాజిక భద్రతా పథకాలను సజావుగా అమలు చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు అమియా పాత్రా, మాజీ ఎంపి పులిన్ బెహరి బుస్కీ, ఇతర స్థానిక, జిల్లా నేతలు పాల్గొన్నారు.