Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరుస గా మూడవ రోజు కూడా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజర య్యారు. యంగ్ ఇండియన్ నుంచి నయా పైసా కూడా తీసుకోలేదని ఈడీ అధికారులకు రాహుల్ సమాధానమిచ్చినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నేషనల్ హెరాల్డ్‌కు చెందిన సంస్థ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆర్థిక అవకతవకల విషయమై ఈడీ అధికారులు రాహుల్‌ను బుధవారం విచారించారు. కాగా, యంగ్ ఇండియన్ లాభాపేక్షలేని కంపెనీ అనీ, కంపెనీల చట్టంలోని ప్రత్యేక నిబంధన కింద చేర్చినట్టు రాహుల్.. ఈడీ అధికారులకు సమాధానమిచ్చారని సమాచారం. ఆ సంస్థ నుంచి ఒక్కపైసా కూడా తీసుకోలేదని రాహుల్ అధికారులకు తెలిపారు. అయితే 2010లో ఈ సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఎటువంటి స్వచ్ఛంద కార్యక్ర మాలు చేయలేదనీ, ఒకవేళ ఏవైనా చేసి ఉంటే.. దానికి సంబంధించిన పత్రాలు, ఆధారాలు సమర్పించాలని రాహుల్‌ను ఈడీ కోరింది.