Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్: పంజాబ్ ప్రముఖ గాయకుడు సిద్దు మూసేవాలా హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోరు ను జూన్ 22 వరకు పంజాబ్ పోలీస్ కస్టడీకి మాన్సా కోర్టు అప్పగించింది. గత నెలలో ఇంటికి వస్తున్న సిద్దును కొంత మంది దుండగులు అడ్డగించి కాల్పులు జరిపిన సంగతి విదితమే. కాగా, ఈ హత్య తామే చేశామంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ ప్రకటించడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. లారెన్స్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య బుధవారం ఉదయం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఎదుట హాజరు పరిచారు. కోర్టు పోలీసు రిమాండ్ విధించిన తర్వాత. అతడిని ఖరార్‌లోని సీఐఏ స్టాఫ్ కార్యాలయానికి తరలించారు. అక్కడే లారెన్స్‌ను విచారించనున్నారు. ఈ హత్య కేసులో లారెన్స్‌ను సిట్, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ (ఏజీటీఎఫ్) విచారించనున్నాయి.