Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా ఆరోగ్యంపై ఎన్నో మాటలు..జనానికి ఉత్తచేతులు
- స్వచ్ఛ భారత్ అంటూ హడావిడి
- స్వచ్ఛ భారత్ వైఫల్యాన్ని బయటపెట్టిన ఎన్ఎఫ్హెచ్ఎస్-5 సర్వే
- పీహెచ్సీ కేంద్రాల పేర్లు మార్చి..ఆయుష్మాన్ భారత్..
- కోవిడ్-19ను అడ్డుకోవటంలో ఘోర వైఫల్యం
- పథకాలపై ప్రచారానికి, క్షేత్రస్థాయి
వాస్తవానికి పొంతనలేని వైఖరి
న్యూఢిల్లీ: కేంద్రంలో మోడీ సర్కార్ పాలన 8ఏండ్లు పూర్తిచేసుకున్న సంద ర్భంగా ఆయా శాఖల ప్రచార ఆర్భాటం అంతా ఇంతా కాదు. ఇక సోషల్ మీడి యాలో అయితే మోడీ మద్దతుదారుల ప్రకటనలు, ప్రచారం..హోరెత్తి పోయి ంది.కుష్టు, క్షయ, బ్లాక్ ఫీవర్...అనేక రోగాలు దేశం నుంచి కనుమరుగు అయ్యా యని, కోవిడ్‌ను తరిమికొట్టామని ప్రచారం సాగింది. ఇదంతా ప్రజల్ని మభ్య పెట్టడం, మోసం చేయటం తప్ప మరోటి కాదని రాజకీయ విశ్లేషకులు విమర్శి స్తున్నారు. ఆయుష్మాన్ భారత్..అంటూ ఎంతో మందిలో ఎన్నో ఆశలు కల్పిం చిన కేంద్రం, ఆ పథకం ఎంత మందికి వర్తిస్తుందో ఇప్పుడు ఎవరికీ తెలియదు. అలాగే 'స్వచ్ఛ భారత్' పేరుతో ప్రధాని మోడీ, ఆయన మద్దతుదారులు చేసిన హడావిడి చూసి..దేశం యావత్తు ఆశ్చర్యపోయింది. బహిరంగ మలవిసర్జన రహితంగా ఆయా గ్రామాలు మారటానికి తమవంతు నిధుల సహకారం అందిస్తామని చెప్పింది. మోడీ ఇచ్చిన నిధులతో చేస్తున్నారని గ్రామాల్లో, పట్టణాల్లో తెగ ప్రచారం చేసుకుంది. చివరికి లబ్దిదారులకు నిధులు ఇచ్చేదగ్గర మొహం చాటేశారు. ఇలాంటి ప్రచార జిమ్మిక్కులతో 8ఏండ్లుగా కేంద్రం నెట్టుకొస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
కోవిడ్‌పై పోరాటం
కోవిడ్-19 వైరస్‌ను ఎదుర్కోవటంలో మోడీ సర్కార్ ఎన్నో తప్పట డుగులు వేసింది. మూడు నెలలకుపైగా లాక్డౌన్ పేరుతో ప్రజల్ని నానా అవస్థ పెట్టింది. కోవిడ్‌ను తరిమికొట్టాం..మా విధానం వల్లే ఇది సాధ్యమైందని స్వయ ంగా ప్రధాని (జనవరి 2021లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో) ప్రకటించారు. అటు తర్వాత రెండో వేవ్‌లో ఎన్నో లక్షలమంది పౌరులు కోవిడ్ బారినపడి చనిపోవటం మనందరికీ తెలిసిందే. ఆక్సీజన్ కొరత, ఔషధాల కొరత, హాస్పిటల్ చికిత్స పొందలేకపోవటం..వంటివి కోట్లాదిమందిని తీవ్రంగా వేధించాయి. శతాబ్దాలుగా మన వైద్య వ్యవస్థ లోపాల్ని కోవిడ్ సంక్షోభం ఎత్తిచూపింది. మొదటివేవ్ తర్వాత మౌలిక వసతులు సిద్ధం చేసుకోకపోవటం, సన్నద్ధత లేకపోవటం..పెద్ద ఎత్తున ప్రాణనష్టానికి దారితీసింది.
ఆయుస్మాన్ భారత్
ఆరోగ్యరంగంలో ప్రజలకు ఎంతో చేస్తున్నామని, వెళ్లిన ప్రతిచోటా అధికార బీజేపీ ఆయుష్మాన్ భారత్ గురించి ప్రస్తావిస్తోంది. ఈ పథకంపై టీవీల్లో, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అంతాఇంతా కాదు. గ్రామాల్లో కొత్తగా 'హెల్త్, వెల్నెస్ సెంటర్ల'ను తీసుకురావటం ఈ పథకంలోని ప్రధాన ఉద్దేశం. ప్రధానిగా 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు పథకం ప్రకటనలతో హోరెత్తించారు. కానీ వాస్తవంగా జరిగింది వింటే..ఇంత మోసమా? అని సగటు పౌరుడు ఆవేదన చెందకమానడు. దేశంలోని 1.5 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని, వాటి సబ్ సెంటర్లను 'హెల్త్, వెల్నెస్ కేంద్రాలు'గా మార్చిం ది తప్ప, ఇందులో కేంద్రం చేసిందేమీ లేదు. ఈ కేంద్రాలకు చాలా కొద్ది మొత్తం లో నిధులు విడుదల చేసి మోడీ సర్కార్ చేతులు దులుపుకుంది. వైద్య నిపుణు లు, సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు, టెక్నీషియన్స్ నియామకాలు జరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని హాస్పిటల్స్‌లో పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి.
స్వచ్ఛ భారత్
ఆరుబయట మలమూత్ర విసర్జనను అరికట్టడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. టీవీల్లో దీనిపై మోడీ సర్కార్ చేసిన ప్రచారం సంగతి చెప్పక్కర్లేదు. మరుగుదొడ్లు కట్టుకొండి...వాటికి స్వచ్ఛభారత్ కింద డబ్బులు ఇస్తామని గ్రామాల్లో ప్రచారం చేశారు. తీరా కట్టుకున్నాక ఎక్కడా కూడా లబ్దిదారులకు ప్రయోజనం దక్కలేదు. స్వచ్ఛభారత్ 100శాతం అమలైన గ్రామంగా కాగితాలపై కేంద్రం లెక్కలు రాసేసుకుంది. ఈదేశంలో ఇప్పటికీ 19శాతం కుటుంబాలు మలమూత్ర విసర్జనకు ఆరు బయటకు వెళ్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 పేర్కొన్నది. ఒడిషా, జార్ఖాండ్, బీహార్..మొదలైన రాష్ట్రాల్లో మరుగుదొడ్లు లేని కుటుంబాలు 30శాతం ఉన్నాయని తెలిపింది.
మాటల్లో తప్ప..చేతల్లో శూన్యం
జాతీయ ఆరోగ్య విధానం-2017 విడుదల చేస్తూ, 2025నాటికల్లా ప్రజావైద్యంపై జీడీపీలో 2.5శాతం నిధులు ఖర్చు చేస్తామని కేంద్రం పేర్కొన్నది. వాస్తవానికి ప్రతిఏటా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు తగ్గుతున్నాయి. ప్రజా వైద్యానికి ప్రాముఖ్యత తగ్గుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రజా వైద్యానికి నిధుల కేటాయింపు జీడీపీలో కేవలం 0.34శాతం మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో 0.35శాతంగా ఉంది. అధికా జనాభా ఉన్న భారత్‌లో నిధుల వ్యయం ఇంత తక్కువగా ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పోషణ్ అభియాన్
పిల్లల్లో, ముఖ్యంగా యుక్త వయస్సు బాలికల్లో పోషకాహార లోపాన్ని తగ్గించటమే లక్ష్యంగా 'పోషణ్ అభియాన్' అనే పథకాన్ని 2018లో తీసుకొ చ్చారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం గతకొన్నేండ్లుగా పిల్లలు, బాలికల్లో రక్తహీనత పెరిగింది. రక్తహీనతతో బాధపడేవారి సంఖ్య బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో వరుసగా 3.2, 2.2, 7.6, 2.4శాతం ఉందని తేలింది. దేశంలో 15-49ఏండ్ల మధ్య మహిళల్లోనూ పోషకాహార సమస్య ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అలాగే క్షయ, కుష్టు, బ్లాక్ ఫీవర్ నివారణ చర్యల్లో ఎంచుకున్న లక్ష్యం నెరవేరక పథకాల అమలు చతికిలపడింది.