Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై దేశంలోని పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేండ్ల సర్వీస్ అంటూ కేంద్రం తమను పిచ్చివాళ్లను చేస్తోందని సైనిక నియామక రిక్రూట్మేంట్కు ప్రిపేర్ అవుతున్న పలు వురు యువకులు మండిపడుతున్నారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్, బుక్సార్ పట్టణాల్లో బుధవారం భారీ ఎత్తున ఆందోళన జరిగింది. నాలుగేళ్ళ తరువాత ఏం చేయాలని ఆందోళనల్లో పాల్గొన్న యువకులు ప్రశ్నిం చారు. 'కేవలం నాలుగేళ్ల సర్వీసు అంటే మనం ఆ తరువాత ఇతర ఉద్యోగాల కోసం వెతుకోవాల్సి ఉంటుంది' అని గుల్షన్ కుమార్ అనే యువకుడు చెప్పాడు. సైనికులకు చెల్లించే జీతం, పెన్షన్ బిలు ్లలను తగ్గించుకోవడానికి మోడీ సర్కార్ కొత్తగా 'అగ్ని పథ్' పథకాన్ని ప్రకటించింది. అయితే సర్వత్రా దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండ గా అగ్నిపథ్ పథకంపై బీహార్‌లోని ముజఫర్‌పూర్, బక్సార్, బెగూసరారులో పలువురు యువకులు నిరసన వ్యక్తం చేశారు. నాలుగేండ్ల సర్వీసు తర్వాత తామంతా ఏం చేయాలని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. కేవలం నాలుగేండ్లు మాత్రమే సర్వీసు ఉంటే ఆ తర్వాత ఇతర ఉద్యోగాల కోసం మళ్లీ చదువుకొని ఇతరులతో పోటీపడాల్సి ఉంటుందన్నారు. కొత్తపథకంపై కొందరు అనుభవజ్ఞులతోపాటు, వివిధ వర్గాల నుంచి విమర్శలు, ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నాలుగేండ్లపాటు మాత్రమే సర్వీసులోకి తీసుకోవడంతో యువతలో పోరాట స్ఫూర్తి దెబ్బతింటుందని కొందరు వాదిస్తున్నారు. అలాగే, రిస్క్ తీసుకోవటంలోనూ అంత చొరవ ప్రదర్శించరని పేర్కొంటున్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ట్విట్టర్లో విమర్శలు చేశారు.
బలగాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది : రాహుల్
భారత్‌కు సరిహద్దులో అనేక సవాళ్లు ఉన్నాయి. అగ్నిపథ్ పథకం మన సాయుధ బలగాల నిర్వహణ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. మన బలగాల గౌరవం, సంప్రదాయం, పరాక్రమం, క్రమశిక్షణ విష యంలో రాజీ పడటాన్ని మోడీ సర్కార్ మానుకో వాలి. అలాటే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా అగ్నిపథ్ పథకంపై విమర్శలు చేశారు. సైనికుల సుదీర్ఘకాల సేవలను భారత ప్రభుత్వం భారంగా భావిస్తోందా? అని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన పథకం యువతకు, దేశానికి అనుకూలంగా లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేందర్ సింగ్ హుడా విమర్శించారు.
సర్వీస్ కాలాన్ని పెంచండి : బి.ఎస్.ధనోవా
ఈ అగ్నిపథ్ పథకంపై నిపుణులతో సహా అనేక మంది విమర్శలు సంధిస్తున్నారు. అనేక ప్రశ్నలు వేస్తున్నారు. నాలుగేళ్ల పదవీకాలం పోరాట స్ఫూర్తిని దెబ్బతీస్తుందని విమర్శిస్తున్నారు. ''తాజాగా ప్రకటించిన రిక్రూట్మెంట్ పాలసికీ రెండు ముఖ్యమైన సిఫార్సులు చేస్తున్నాను.అందులో ఒకటి.. సర్వీస్ కాలాన్ని కనీసం ఏడు సంవత్సరాలకు పెంచండి. రెండవది.. తీసుకున్న వారిలో కనీసం 50 శాతం మందిని పూర్తి కాలం కొనసాగించండి'' అని మేజర్ జనరల్ (రిటైర్డ్) బి.ఎస్ ధోనోవా ట్వీట్ చేశారు.
దేశవ్యతిరేక పథకాన్ని వెంటనే రద్దు చేయండి
'ఫ్రొఫెషనల్ ఆర్మీని పెంచడానికి బదులుగా మోడీ ప్రభుత్వం పెన్షన్ డబ్బును ఆదా చేయడానికి 'కాంట్రాక్ట్ సైనికులను'ను ప్రతి పాదించింది. 3 లేదా 5 ఏళ్ల తరువాత ఇతర అవకాశాలు లేకపోవడంతో ఈ శిక్షణ పొందిన కాంట్రాక్ట్ సైనికులు ప్రైవేట్ సైన్యానికి సేవ చేస్తారు. దేశ వ్యతిరేక పథకాన్ని వెంటనే రద్దు చేయండి' అని సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు.