Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెగ్యులర్ నియామకాన్ని తక్షణమే చేపట్టాలి
- కేంద్రం పథకాన్ని తీవ్రంగా ఖండించిన సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో
న్యూఢిల్లీ : భారతదేశ ప్రయోజనాలకు భంగం కలిగించే 'అగ్నిపథ్' పథకాన్ని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. ఈ అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి సాయుధ దళాల్లోకి రెగ్యులర్ నియామకాలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేసింది. నాలుగు ఏండ్ల పాటు 'ఒప్పందంపై సైనికులను' నియమించటం ద్వారా వృత్తిపరమైన సాయుధ బలగాలను పెంచటం సాధ్యం కాదని పేర్కొన్నది. ఈ పథకం పెన్షన్ డబ్బును ఆదా చేయటం, సాయుధ దళాల నాణ్యత, సామర్థ్యం విషయంలో రాజీ పడేలా చేస్తుందని ఆరోపించింది. గత రెండేండ్లుగా భారత ఆర్మీలో నియామకాలు జరగలేదని గుర్తు చేసింది. ఈ పథకం కింద నియమి తులైన సైనికులకు నాలుగేండ్ల తర్వాత ఉపాధి అవకాశాలుండవని ఆందోళన వ్యక్తం చేసింది. కనీస ఉద్యోగ భద్రత కల్పించకుండా అత్యు న్నత త్యాగానికి సిద్ధపడాలని యువతకు పిలుపునివ్వడాన్ని నేరంగా అభివర్ణించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక నిరసనలు ఈ పథకంపై ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తాయని పొలిట్ బ్యూరో పేర్కొన్నది.