Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి
న్యూఢిల్లీ : అసోంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. గోపాలపురలో కొండచరియలు విరిగిపడి గురువారం ఇద్దరు మైనర్లు చనిపోయారు. గువహతిలో కురుస్తున్న వర్షాలకు నగరమంతా వరద నీటితో నిండిపోయింది. అనిల్ నగర్, నబిన్ నగర్, రాజ్‌గఢ్ లింక్ రోడ్, రుక్మిణిగావ్, హతిగావ్, కృష్ణానగర్‌లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరద ప్రభావిత ప్రాంతమైన అనిల్నగర్ను గురువారం హౌసింగ్, అర్బన్ వ్యవహారాల శాఖ మంత్రి అశోక్ సింఘాల్ సందర్శించారు. ఈ నెల 14 నుంచి గౌహతిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ లేదు. కరెంట్ పునరుద్ధరణకు అసోం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ 24గంటలు పనిచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. బరగాన్లో మంగళవారం మట్టిపెళ్లలు విరిగి నలుగురు మృతి చెందారు. గీతానగర్, సోనాపూర్, కాలాపహార్, నిజారపర్ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎఎస్డీఎంఏ) అధికారి తెలిపారు.