Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ భారీ నిరసనలు
- ఢిల్లీలో ఎస్ఎఫ్ఐ నేతల అరెస్టు
న్యూఢిల్లీ : సాయుధ దళాల్లో శాశ్వత ఉద్యోగాలకు ఎగనామం పెట్టి, కాంట్రాక్టీకరణకు నాంది పలికిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో భారీ నిరసనలు చేపట్టాయి. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఐటీఓ వద్ద ఆందోళన జరిగింది. ఢిల్లీ పోలీసులు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లో భారీస్థాయిలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విద్యార్థి, యువకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. బీహార్‌లో అన్ని జిల్లాల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. కొన్ని చోట్ల జాతీయ రహదారులను అడ్డుకున్నారు. హర్యానాలో జాతీయ, రాష్ట్ర రహదారులపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది.