Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమలుకు రంగం సిద్ధం : ఎయిర్ చీఫ్
న్యూఢిల్లీ : త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన కొత్త పథకం అగ్నిపథ్‌పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ.. ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్ని వీరుల నియామకాలను వైమానిక దళం చేపట్టనుంది. జూన్ 24వ తేదీ నుంచి వైమానిక దళంలో ఈ పథకం కింద నియామక ప్రక్రియ మొదలు కానున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి తెలిపారు. అగ్నిపథ్ పథకంపై తీవ్ర విమర్శలు రావడంతో పాటు ఆందోళనలు తీవ్రతరం అవ్వడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అగ్నిపథ్ స్కీమ్ వయోపరిమితిని పెంచింది. ఇంతకు ముందు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయోపరిమితి ఉంటే తాజాగా 23కు పెంచింది. ఈ వయో పరిమితి పెంచడాన్ని భారత వైమానిక దళం స్వాగతిస్తున్నట్లు విఆర్ చౌదరి పేర్కొన్నారు.
వయోపరిమితిని పెంచడం వల్ల అది యువతకు దోహదపడుతుందన్నారు. ఐఎఎఫ్ కూడా తన ట్విట్టర్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది.