Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ భారీ నిరసనలు
- ఢిల్లీలో ఎస్ఎఫ్ఐ నేతలు అరెస్టు
న్యూఢిల్లీ : సాయుధ దళాల్లో శాశ్వత ఉద్యోగాలకు ఎగనామం పెట్టి, కాంట్రాక్టీకరణకు నాంది పలికిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో భారీ నిరసనలు చేపట్టాయి. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఐటీఓ వద్ద ఆందోళన జరిగింది. ఢిల్లీ పోలీసులు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లో భారీస్థాయిలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విద్యార్థి, యువకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. బీహార్‌లో అన్ని జిల్లాల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. కొన్ని చోట్ల జాతీయ రహదారులను అడ్డుకున్నారు. హర్యానాలో జాతీయ, రాష్ట్ర రహదారులపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. హిమాచల్‌ప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల్లో ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నేతలు మాట్లాడుతూ సాయుధ బలగాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అగ్నిపథ్ తీవ్ర ప్రజా వ్యతిరేకమైనదనీ, దేశ వ్యతిరేకమైనదని విమర్శించారు. ఇప్పటికే తిరోగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత రేట్లు ఎప్పుడూ లేనంతగా ఉందని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య దేశ యువతకు భయంకరమైన పరిస్థితులను తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సాయుధ దళాలు ఇప్పటివరకు మంచి జీతాలు, ఇతర భద్రతలతో ఉన్న ఉద్యోగాలు, పోయి అగ్నిపథ్ పథకంతో పెన్షన్లను పూర్తిగా పోతాయని తెలిపారు.