Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ ఆచూకీ కానరావడం లేదు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఆమె ఎక్కడున్నారన్నదీ తెలియరాలేదు. రజా అకాడమీ జాయింట్ సెక్రటరీ ఇర్ఫాన్ షేక్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ నివాసి నుపూర్పై ముంబయి పోలీసులు గత నెలలో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను ప్రశ్నించేందుకు ఢిల్లీ వెళ్లిన ముంబయి పోలీసుల బృందం.. ఐదు రోజుల పాటు గాలించినా.. ఆమె ఆచూకీ తెలియలేదు. ఇప్పటి వరకు నుపుర్ శర్మ జాడ కానరాలేదనీ, ఆమె కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఆమెను అరెస్టు చేసేందుకు తగిన ఆధారాలున్నాయని మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.