Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్నిపథ్ ఆందోళనకారులకు వరుణ్‌గాంధీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ : అగ్నిపథ్ పథకంపై తీవ్ర ఆగ్రహ జ్వాలలతో ఆందోళనలు చేపడుతున్న యువతకు బీజేపీ ఎంపి వరుణ్ గాంధీ మద్దతు తెలిపారు. అదే సమయంలో సహనంతో ఉండాలనీ, ప్రజాస్వామ్య ఔచిత్యాన్ని కొనసాగించాలని యువతకు ఓ వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. సైనికుడిగా దేశ ప్రయోజనాలుకు ప్రాధాన్యత ఇవ్వాలనీ, మన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం నైతికంగా చాలా తప్పు అని పేర్కొన్నారు. అహింసా పద్ధతులను వీడి.. శాంతియుత నిరసనలను చేపట్టాలని సూచించారు. అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ మేసేజ్‌లు, ఉత్తరాలు, వీడియోలు పంపిన పలువురితో తాను మాట్లాడానని అన్నారు. అగ్నిపథ్ పథకంపై ఈ ఆగ్రహం సహేతుకమైనదేననీ, అయితే ప్రజాస్వామ్యంపై గౌరవంతో మీ ఆవేదనను అర్థమయ్యేలా ప్రభుత్వానికి తెలియజేయండని ఆందోళనకారులకు సూచించారు. మెమొరాండమ్, సోషల్ మీడియా, శాంతియుత నిరసనల ద్వారా కేంద్రానికి మీ సమస్యను తెలపాలని అన్నారు. 'సురక్షితమైన భవిష్యత్ ప్రతి యువకుని వ్యక్తిగత హక్కు. న్యాయం జరుగుతుంది' అని వరుణ్ అన్నారు. గడిచిన 24 గంటల్లోనే కేంద్రం అగ్ని వీరుల వయో పరిమితి పెంచిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం తగిన మార్పులు చేస్తుందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. మీ హక్కుల కోసం పోరాడాలని అంటూనే శాంతియుతంగా, సద్భావనతో సాధించుకోవాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.