Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్నిపథ్‌ను రద్దు చేయండి : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : అగ్నిపథ్ కింద నాలుగేండ్ల స్వల్ప కాలిక సర్సీసుకు త్రివిధ దళాల్లో యువతను నియమించుకోవాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నామని సీపీఐ(ఎం) పేర్కొన్నది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం సాయుధ దళాల్లో 1.13 లక్షల మంది సిబ్బంది, 9,363 మంది అధికారులు లేరని పేర్కొన్నది. రక్షణ బడ్జెట్లో పెన్షన్ కాంపోనెంట్‌ను ఆదా చేసేందుకు 2032 నాటికి 50 శాతం సాయుధ దళాలను కాంట్రాక్టు సైనికులుగా మార్చటమే కేంద్రం లక్ష్యమని ఆరోపించింది. ప్రాంతీయ కోటాను తొలగించాలనే నిర్ణయమూ తిరోగమన చర్యగా పేర్కొన్నది. ఒప్పంద సైనికుల నాణ్యతపై ఆర్మీ అనుభవజ్ఞులు, రక్షణ నిపుణులు ఇప్పటికే తమ భయాన్ని వెల్లడించారని వివరించింది. యువకుల పోస్ట్-సర్వీసు కేరీర్ ఆందోళనలు సైన్యంలోని వృత్తి నైపుణ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయన్న వారి ఆందోళనలను పార్టీ ఉటంకించింది. పథకం కింద శిక్షణ పొందిన పెద్ద కేడర్ ప్రతి సంవత్సరం నిరుద్యోగులుగా మారడంతో కలిగే సామాజిక పరిణామాలను కొట్టిపారేయలేమని ఆందోళన వ్యక్తం చేసింది. 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్'తో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ చర్య ద్వారా రెండింటినీ తొలగించిందని వివరించింది. కాంట్రాక్టులైజేషన్తో పాటు సాయుధ బలగాలలో ప్రాంతీయ కోటాను తొలగించటాన్ని మోడీ ప్రభుత్వం దేశ, యువకులకు వ్యతిరేకమైనదిగా పరిగణిస్తుందని సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ వివరించింది. ఈ రెండింటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది.