Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2020-21లో రూ.752కోట్లు
- బీజేపీకి భారీగా విరాళాలు
- 2020-21లో రూ.752కోట్లు
- బడా కార్పొరేట్లు, అత్యంత ధనికుల విరాళాల్లో 75శాతం బీజేపీకే..
- కాంగ్రెస్కు రూ.285కోట్లు : ఏడీఆర్ వెల్లడి
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల పథకం అధికార బీజేపీకి వేలకోట్ల రూపాయిల్ని కురిపిస్తోంది. దేశంలోని బడా కార్పొరేట్లు, అత్యంత ధనికులు ఇస్తున్న భారీ విరాళాల్లో అత్యధికం (75శాతం) ఒక్క బీజేపీకే వెళ్తున్నాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, తృణమూల్, సీపీఐ, సీపీఐ(ఎం)..తదితర జాతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2020-21 ఆదాయ, వ్యయాల వివరాలు ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్) సేకరించి..పై లెక్కలు విడుదల చేసింది. ఏడీఆర్ వెల్లడించిన గణాం కాల ప్రకారం, 2020-21లో ఆయా పార్టీలకు ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలు రూ.1373 కోట్లు. కాగా ఇందులో ఒక్క బీజేపీకి రూ.752కోట్లు విరాళాలుగా అందాయి. అంటే మొత్తం ఎన్నికల బాండ్ల విరాళాల్లో ఒక్క బీజేపీకి 55శాతం వాటా అందిందని తెలుస్తోంది. బడా కార్పొరేట్లు, అత్యంత ధనికుల నుంచి వచ్చిన భారీ విరాళాల్లో దాదాపు 75శాతం (రూ.477కోట్లు) బీజేపీకి దక్కాయి. అత్యధికంగా విరాళాలు పొందిన బీజేపీ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. ఆ పార్టీ 2020- 21లో ప్రకటించిన ఆదాయం రూ.285గా ఉంది. రూ.1కోటితో కూ డిన బాండ్ల ద్వారా కాంగ్రెస్కు సుమారుగా రూ.70కోట్లు (11 శాతం) ఆదాయం సమకూరింది. ఎన్నికలు, ప్రచారం కోసం బీజేపీ రూ.421 కోట్లు ఖర్చు చేయగా, రూ.145కోట్లను నిర్వహణ నిమిత్తం వెచ్చించి నట్టు పేర్కొన్నది. తృణమూల్ కాంగ్రెస్కు రూ.42.51కోట్లు, ఎన్సీపీకి రూ.26.26కోట్లు అందాయి. అయితే క్రితం ఆర్థిక సంవత్సరం (2019-20)తో పోల్చితే 2020-21లో ఎన్నికల బాండ్ల విరాళాలు తగ్గినట్టు బీజేపీ, కాంగ్రెస్ ఈసీకి లెక్కలు చూపాయి. 2019-20 ఏడాది మొత్తం ఎన్నికల బాండ్లలో 75శాతం బీజేపీకి వెళ్లాయి.