Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్ బంద్.. పాట్నా సహా అనేక చోట్ల ఆందోళనలు
- అగ్నిపథ్ పథకంరద్దు చేయాలనిడిమాండ్
డెహ్రడూన్, రాంచీ, బీహార్, మహారాష్ట్ర, రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్నిపథ్ నిరసనలు కొనసాగుతున్నాయి. పథకాన్ని రద్దు చేయాలని యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది.
ఆర్మీ రిక్రూట్మేంట్లో ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ పూర్తిచేసుకున్న వేలాదిమంది అభ్యర్థులు శనివారం నిరసనలకు దిగారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. అగ్నిపథ్ వ్యతిరేక నిరసనలతో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. శనివారం బీహార్ బంద్ విజయవంతమైంది. దుకాణాలు, హోటల్స్, విద్యాలయాలు మూతపడ్డాయి. పాట్నా సహా పలు నగరాల్లో యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నిఘా వర్గాల సమాచారంతో విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాల్లో ఆర్మీకి పోటీ పడుతున్న అభ్యర్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ : అగ్నిపథ్ రిక్రూట్మెంట్ విధానాన్ని నిరసిస్తూ బీహార్, ఉత్తరప్రదేశ్ సహా యువత తీవ్ర ఆందోళన చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 250 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ, డెహ్రాడూన్, రాంచీలోనూ యువత రోడ్డు మీదకు వచ్చి మోడీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఫిరోజాబాద్, అలీఘడ్, వారణాసి, గౌతమ్ బుద్ద నగర్ జిల్లాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. బీహార్‌లోనూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సుప్రీంకోర్టులో పిటిషన్
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' రిక్రూ ట్మెంట్ పథకానికి వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటు చేసు కోవడంపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖ లైంది. ఈ హింసాత్మక నిరసనలపై ప్రత్యేక విచారణ బృందం (సిట్)తో దర్యాప్తునకు ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆ పిటిషన్ కోరింది. హింసాత్మక ఘటనల కారణంగా రైల్వేలతో సహా ప్రజా ఆస్తుల ధ్వంసం దర్యాప్తు జరపాలని, అగ్నిపథ్ పథకాన్ని, జాతీయ భద్రత, ఆర్మీపై దాని ప్రభావాన్ని సమీక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా ఆదేశించాలని పిటిషన్‌దారు కోరారు. ఢిల్లీ న్యాయ వాది విశాల్ తివారీ ఈ పిల్ వేశారు.
శాంతియుతంగా పోరాడండి : సోనియాగాంధీ
అగ్నిపథ్ పథకంపై పోరాటాన్ని చేపట్టిన యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. పథకాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో పార్టీ మీకు అండగా నిలబడుతుంది. యువత తమ నిరసన కార్యక్రమాల్ని శాంతియుతంగా చేపట్టాలి. అభ్య ర్థుల భావాలను విస్మరించి దిక్కు, దిశలేని కొత్తరకం సైనిక రిక్రూట ్మెంట్ పథకాన్ని ప్రకటించడం తీవ్ర నిరాశకు గురిచేసింది. చాలా మంది మాజీ సైనికులు కూడా కొత్త పథకంపై ప్రశ్నలు లేవనెత్తారు.