Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్నివీరులకు 10శాతం రిజర్వేషన్
న్యూఢిల్లీ : త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం మభ్యపెట్టే చర్యలను చేపట్టింది. ఈ పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందే అగ్నివీరులకు రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కొన్ని విషయాలు వెల్లడించారు. ''తగిన అర్హత ఉన్న అగ్నివీరులకు రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.
ఇండియన్ కోస్ట్‌గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులతోపాటు 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ విభాగాలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ప్రస్తుతమున్న ఎక్స్ సర్వీస్‌మెన్ కోటాతోపాటు ఈ రిజర్వేషన్ అమలవుతుంది. ఇందుకోసం నియామక నిబంధనల్లో తగిన సవరణలు చేయనున్నాం. వయో పరిమితి సడలింపు కూడా చేయనున్నా''మని రక్షణ శాఖ వెల్లడించింది.