Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారీ వరదల బీభత్సం
- అసోం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపురలో నీట మునిగిన పలు ప్రాంతాలు
- 55కు చేరుకున్న మృతుల సంఖ్య
గువహతి: ఈశాన్యాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అసోం, మేఘాలయ, అరుణా చల్‌ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు వరదలతో అతలాకుత లమయ్యాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. మరణాలు నమోద య్యాయి. అసోంలో మరో తొమ్మిది మంది మృతి చెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారని రాష్ట్ర విపత్తు నియంత్రణ సంస్థ వెల్లడించింది. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వరదల కారణంగా మృతి చెందినవారి సంఖ్య 55కు చేరింది.
అసోంలోని 28 జిల్లాల్లో 19 లక్షల మందిపై భారీ వరదల ప్రభావం పడింది. హొజై, నల్బరీ, బజాలి, ధుబ్రి, కామ్రూప్, కొక్రఝర్, సొంటిపూర్ జిల్లాల నుంచి మరణాలు నమోదయ్యాయి. దిమా హసావో, గొపరా, హొజై, కామ్రూప్, కామ్రూప్ (మెట్రోపాలిటన్), మొరీగావ్ జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకు న్నాయి. హొజై జిల్లాలో వరద బాధితులతో వెళ్తున్న ఒక పడవ నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. 21 మందిని రెస్క్యూ టీమ్‌లు రక్షించాయి. ముంపునకు గురైన ఇస్లాంపూర్ గ్రామం నుంచి 24 మందితో కూడిన ఒక పడవ శుక్రవారం రాత్రి సమయంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశాయి. రారుకోట ప్రాంతంలో పడవ మునిగిపోయింది.
ప్రమాదకర స్థాయిలో నదులు
నాగావ్ జిల్లా కాంపూర్ వద్ద కొపిలీ నది ''అధిక వరద స్థాయి''లో ప్రవహిస్తున్నదని కేంద్ర జల కమిషన్ (సీడబ్ల్యూసీ) ఒక బులిటెన్‌లో పేర్కొన్నది. అలాగే, బ్రహ్మపుత్ర, జియా-భరాలీ, పుతిమరి, మనాస్, బేకి, బరాక్, కుషియారా నదులు ప్రమా దకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని వివరించింది. వరదల కారణంగా దాదాపు 2,930 గ్రామాలు ప్రభావితమయ్యాయి. 43,338 హెక్టార్ల పంట నష్టం కలిగింది. 410 జంతువులు మృత్యువాత పడ్డాయి. గువహతి నగరంలో చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. కనీసం 234 రోడ్లు, 16 బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని అక్కడి అధికారులు తెలిపారు. ప్రధాని మోడీ అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మతో మాట్లాడి వరద పరిస్థితి గురించి తెలుసు కున్నారు. కేంద్రం నుంచి సహాయముంటుందని హామీనిచ్చినట్టు మోడీ ట్వీట్ చేశారు.
మాసిన్రామ్లో భారీ వర్షపాతం నమోదు
ఇటు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లు వరదలతో తీవ్ర నష్టాన్ని చూశాయి. రోడ్లు ధ్వంస మయ్యాయి. కొండచరియలు విరిగి పడ్డాయి. అనేక గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి. మేఘాలయ లోని ఈస్ట్ ఖాసి హిల్స్ జిల్లాలో గల మాసిన్రామ్, సోహ్ర (ఒకప్పటి చిరపుంజీ) లలో భారీ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. శుక్రవారం మేఘాలయ లో 972 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మాసిన్రామ్లో 1003.6 మిల్లీమీటర్లుగా రికార్డయ్యి ంది. 18 మంది మృతి చెందారు.
అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో..
అరుణాచల్ ప్రదేశ్ వరదల ధాటికి ప్రభావి తమైంది. సుబాన్సిరి నది నుంచి నీరు వచ్చి నిర్మాణంలో ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు డ్యామ్‌లోకి వచ్చి చేరింది. దీంతో వర్కర్లు అక్కడ నుంచి వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు. కుండ పోత వర్షాలతో ధెమాజీ, లఖింపూర్ జిల్లాల్లోని అనేక గ్రామాలు నీట మునిగాయని అధికారులు చెప్పారు. పశ్చిమ త్రిపుర జిల్లాలోని సదర్ సబ్ డివిజన్ వరదలో మునిగిపోయింది. దీంతో 2000 మందికి పైగా వరద బాధితులను అక్కడి నుంచి 20 సహాయ శిబిరాలకు తరలించారు. అయితే, ఎలాంటి మర ణాలూ చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు.