Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ :ట్రాఫిక్‌లో జరిగిన వాగ్వాదం కారణంగా జేఎన్యూకు చెందిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను కొందరు దుండగులు కొన్ని గంటల పాటు నిర్భంధించి, భౌతికంగా దాడి చేసి, నగదు దోపిడి చేశారు. ఈ ఘటనను జేఎన్‌యూ టీచర్స్ అసోషియేషన్ (జేఎన్‌యూటీఏ) తీవ్రంగా ఖండించింది. దోషుల్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేసింది. అయితే పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. జేఎన్‌యూటీఏ ప్రకటన ప్రకారం ఈ నెల 17న సాయంత్రం ప్రొఫెసర్ శరద్ బావిస్కార్ తన కారులో ప్రయాణం చేస్తుండంగా, కొంత మంది దుండగులతో వాగ్వివాదం జరిగింది. ఈ విషయాన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వెళ్తానని శరద్ చెప్పడంతో ఆ దుండగుల అతన్ని కిడ్నాప్ చేశారు. ఆ రాత్రంతా ప్రొఫెసర్‌ను నిర్భంధంలో ఉంచారు. భౌతికంగా దాడి చేశారు.