Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాట్నాలో అత్యవసర ల్యాండింగ్
ఢిల్లీ : బీహార్ రాజధాని పాట్నా నుంచి ఢిల్లీ బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే మంటలు చెలరేగాయి. దీంతో, అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. విమానం బయల్దేరిన కొద్దిసేపటికే ఎడమ ఇంజిన్‌ను ఓ పక్షి ఢకొీట్టింది. దీంతో ఇంజిన్‌లో స్వల్పంగా మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు గుర్తించారు. ఈ విషయాన్ని పైలెట్లకు తెలియజేయడంతో, విమానాన్ని తిరిగి పాట్నా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పక్షి ఢకొీట్టడం వల్లే విమానంలో మంటలు చెలరేగాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. ఈ విషయాన్ని గ్రహించిన వెంటనే ఇంజిన్‌ను ఆపేసిన పైలట్లు.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు తెలిపింది.