Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి చేస్తాం : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో దేశరాజధాని ఢిల్లీ ముఖచిత్రం మారుస్తామని, నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం పేర్కొన్నారు. రూ. 920 కోట్ల వ్యయంతో నిర్మించిన అభివృద్ధి పనులకు ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్టు యొక్క ప్రధాన సొరంగం, ఐదు అండర్‌పాస్‌లను ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో మోడీ ప్రారంభించారు. ఢిల్లీలో మెట్రో ట్రాక్‌లను రెట్టింపు చేశామని, పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే, ఢిల్లీ-మీరట్ హైవే వంటి ప్రాజెక్టులు పూర్తి చేసామని ఈ సందర్భంగా ప్రధాని మోడీ గుర్తు చేశారు.
ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్టుతో 55 లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతుందని, కాలుష్యం తగ్గుతుందని తెలిపారు. ఈ రోజు ప్రారంభించిన 1.6 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఢిల్లీలో మొదటదని చెప్పారు. తూర్పు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతాలనుంచి ఇండియా గేట్, సెంట్రల్ ఢిల్లీ వంటి ప్రాంతాలకు సులువుగా వెళ్లడానికి ఈ సొరంగం అనుమతిస్తుందని తెలిపారు. 'సమయమే నగదు' అని మోడీ చెప్పారు. ప్రజలకు ప్రభుత్వం రూ 100 ప్రకటిస్తే ప్రధానవార్తల్లో నిలుస్తుందని, కానీ రూ 200 ఆదా చేస్తే ఎవ్వరూ మాట్లాడరని అన్నారు.