Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్నిపథ్ దేశ యువతను చంపేస్తుంది
- సైన్యాన్ని అంతం చేస్తోంది :
కాంగ్రెస్ సత్యాగ్రహంలో
- ప్రియాంక గాంధీ
- నిరుద్యోగుల పాలిట అగ్ని బాట: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు సీనియర్ నేతలంతా ఈ ధీక్షలో పాల్గొన్నారు. ఆదివారం జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ ఆందోళన చేపట్టింది. ప్లకార్డులు పట్టుకొని కాంగ్రెస్ నేతలంతా ఆందోళన భాగస్వామ్యం అయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ నిరుద్యోగులు తమ నిరసనలు ఆపవద్దని, కానీ శాంతియుతంగా కొన సాగించాలని సూచించారు. ఈ యువత వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని కూల్చాలని పిలుపు ఇచ్చారు. అగ్నిపథ్ పథకం సైన్యాన్నిఅంతం చేస్తుందని విమర్శించారు. ''ఈ స్కీమ్ దేశ యువతను చంపే స్తుంది. ప్రభుత్వ ఉద్దేశం సరైంది కాదు. ప్రజాస్వామ్య బద్ధంగా, శాంతియుతంగా, అహింసాయుత పద్ధతు ల్లో ప్రభుత్వాన్ని పడగొట్టండి. మీ లక్ష్యం దేశానికి నిజమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలి. దేశ ఆస్తులను పరిరక్షించండి. నిరసనలు శాంతియుతంగా చేయా లని, ఆపొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మీ హక్కు, ఇది మీ దేశం, మీ దేశాన్ని పరిరక్షించుకునే బాధ్యత మీకు ఉంది. ప్రతి కాంగ్రెస్ నేత, కార్యకర్త మీతో ఉంటారు'' అని తెలిపారు. 24 గంటలలు గడవకముందే బీజేపీ ప్రభుత్వం సైనిక నియామకాల పథకం నిబంధనలను మార్చిందని, ఇది చూస్తుంటే అగ్నిపథ్ నిర్ణయాన్ని హడావుడిగా తీసుకొన్నట్లు తెలుస్తోందని అన్నారు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వైమానిక దళంలో నిలిచిపోయిన నియామక ప్రక్రియ ఫలితాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ప్రధాన మంత్రే బాధ్యత వహించాలి:
రాహుల్ గాంధీ
సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం నిరుద్యోగుల పాలిట అగ్నిబాట అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉద్యోగాలపై ప్రధానమంత్రి పదేపదే తప్పుడు ఆశలు కల్పించి యువతను అగ్నిమార్గంలో పయణించేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఎనిమిదేండ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని, కానీ యువతకు ఎటువంటి ఉపాధి కల్పించలేదని విమర్శించారు. పైగా పకోడీలు, ప్రైలు చేసుకోవడం కూడా ఉద్యోగమని అనడం దేశ యువతను కించపరచడమేనని అన్నారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి ప్రధాన మంత్రే బాధ్యత వహించాలని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీమ్‌తో దేశ భద్రతకు ముప్పుని అన్నారు. నాలుగేళ్ల తరువాత ఆ యువకుల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. అగ్నిపథ్ తో రూ.5లక్షల కోట్ల పెన్షన్‌ను సేవ్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ స్కీమ్‌తో రక్షణ శాఖలో 15శాతం రిక్రూట్మెంట్ ఆగిపోతుందని, పాక్, చైనా నుంచి ముంపు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కెసి వేణుగోపాల్, జైరాం రమేష్, హరీష్ రావత్, దిగ్విజరు సింగ్, అదిర్ రంజన్ చౌదరి, సచిన్ పైలట్, ప్రమోద్ తివారీ, గౌరవ్ గోగరు, జెడి శీలం, సల్మాన్ ఖుర్షీద్, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు తదితరులు దీక్షలో పాల్గొన్నారు.