Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవింద్ పదవీ కాలం ముగింపునకు ముందు మోడీ కలయిక..
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌తో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఐదేండ్ల పదవీ కాలం జులై 24తో ముగియనున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 'ప్రధాని మోడీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను రాష్ట్రపతి భవన్లో కలిశారు' అని రాష్ట్రపతి భవన్ ఆదివారం ట్వీట్ చేసింది. ఈ నెల 15న 16వ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్లు వేసేందుకు ఆఖరి తేదీ ఈ నెల 29. రాష్ట్రపతి ఎన్నిక జులై 18న, కౌంటింగ్ జులై 21న జరగనున్నాయి. ఈ నెలలో రాష్ట్రపతిని ప్రధాని కలవడం ఇది రెండోసారి. ఈ నెల ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ దేహత్‌లోని తన పూర్వీకుల గ్రామమైన పరాంఖ్లో రాష్ట్రపతి పర్యటించారు. ఈ పర్యటనలో మోడీ కూడా పాల్గొన్నారు.