Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో అగ్నిపథ్ నిరసన జ్వాలలు చల్లారటం లేదు. అనేక రాష్ట్రాల్లో ఈ వివాదాస్పద పథకం రద్దు కోరుతూ నిరసనలు సాగాయి. కేంద్రం నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచి అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా యువత, ఆర్మీ అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. యవత నుంచి ఇంత పెద్ద సంఖ్యలో నిరసనలు వ్యక్తమవుతున్నా.. ప్రతిపక్ష పార్టీల నాయకులు పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం తన మొండి పట్టును విడవటం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పథకాన్ని ముందుకు తీసుకెళ్తామనీ, దానిని రద్దు చేసే ప్రసక్తే లేదని మోడీ సర్కారు ప్రకటనలిస్తున్నది. పంజాబ్‌లోని లుధియానాలో నిరసనకారులు రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేశారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ వీడియో ఫుటేజీలు తమ వద్ద ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు. వాటి ఆధారంగా నిందితులను గుర్తిస్తామని చెప్పారు. యూపీలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఫిరోజాబాద్‌లో నిరసనకారులు బస్సులపై దాడికి దిగారు. వాహనాల అద్దా లను ధ్వంసం చేశారు. హింసను ప్రేరేపించారన్న ఆరోపణలపై ఐదుగురిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో కాంగ్రెస్, వీసీకేలు ఆందోళనలు చేపట్టాయి.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలోని జంతరమంతర్ వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. ఇందులో ప్రియాంక గాంధీతో పాటు రాజస్థాన్ ఉప ముఖ్య మంత్రి సచిన్ పైలెట్, కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఆందోళన సందర్భంగా భద్రతను కటు ్టదిట్టం చేశారు. అగ్నిపథ్ పథకం దేశ యువతకు, ఆర్మీకి నష్టాన్ని తీసుకొస్తుం దని ప్రియాంక ఆరోపించారు. నకిలీ దేశభక్తులను యువత గుర్తించాలని ఆమె కోరారు. ఈ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు పార్టీ నుంచి పూర్తి మద్దతుంటుందని హామీనిచ్చారు.
రాజస్థాన్ క్యాబినేట్ తీర్మానం
కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజస్థాన్ క్యాబినేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. పథకం రద్దు కోరుతూ ఆప్ ఎంపీలు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. బీహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కారు (జేడీయూ-బీజేపీ) ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటు న్నారనీ, అన్ని సమస్యలున్నప్పుడు ఎందుకు కలిసుంటు న్నారని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. ఈ పథకం విషయంలో కేంద్రం ఎవరీని సంప్రదించలేదనీ, దీనిని రద్దు చేయాలన్నది యువత డిమాండ్ అని ఆయన తెలిపారు.
రైలు సర్వీసులకు అంతరాయం
అగ్నిపథ్ నిరసనలతో ఈస్టర్న్ రైల్వే 29 రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని ంటిని రీషెడ్యూల్ చేసింది. రైళ్ల రద్దు కొన్ని రోజులుంటుందని ఈస్టర్న్ రైల్వే జీఎం అరుణ్ అరోరా తెలిపారు. అగ్నిపథ్ నిరసనల ఎఫెక్ట్ తమిళనాడులోని రైల్వే సర్వీసులపై పడ్డాయి. దక్షిణ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.
'బీజేపీ ఆఫీసు వద్ద భద్రతకు అగ్నివీర్లకు ప్రాధాన్యత'
ఈ పథకంపై బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అగ్నిపథ్‌పై బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజరువర్గీయ చేసిన కామెంట్లు ఈ విధంగానే ఉన్నాయి. పథకం కింద శిక్షణ పొంది సేవలందించిన అగ్నివీర్ సైనికులను బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద భద్రత కోసం జరిపే నియామకాల్లో ప్రాధాన్యతనిస్తామని ఆయన అన్నారు
అగ్నిపథ్ రద్దు చెయ్యం : రక్షణ మంత్రిత్వ శాఖ
వివాదాస్పద పథకంపై దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు కొనసాగు తున్నప్పటికీ మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గటం లేదు. అగ్నిపథ్‌ను రద్దు చేయ బోమని స్పష్టం చేసింది. ఈ మేరకు మిలిటరీ వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ అనిల్ పూరీ తెలిపారు. యువభారతావనిని తయారు చేయటంలో భాగంగా దీనిని పురోగామి చర్యగా రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అగ్నిపథ్ పథకంలో తీసుకొచ్చిన మినహాయింపులు అల్లర్లు, ఆందోళన లకు స్పందనగా తీసుకురాలేదనీ, ఇవి ముందే నిర్ణయించు కున్నవని అధికారులు చెప్పారు. ఎఫ్ఐఆర్లో పేరు నమోదైతే అభ్యర్థులు అగ్నిపథ్ లో చేరలేరని మిలిటరీ వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్లినెంట్ జనరల్ అనిల్ పూరీ హెచ్చరించారు.