Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన వారిలో ఒక మహిళా మావోయిస్టు ఉన్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.... మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా బహేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో (మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం) భద్రతాదళాలు కూబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. వీరిలో డివిజినల్ కమిటీ సభ్యుడు నగేష్‌పై రూ.15 లక్షల రివార్డు, ఏరియా కమాండర్ మనోజ్, మహిళా మావోయిస్టు రమేపై చెరో రూ.8 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు.