Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనేశ్వర్ : ఒడిషాలోని నౌపడ జిల్లాలో భైన్సాదనిలో మావోయిస్టులు మంగళవారం జరిపిన దాడిలో కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు (సిఆర్పిఎఫ్)కు చెందిన ముగ్గురు జవాన్లు చనిపోయారు. మరణించిన జవాన్లను ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లా లల్గారి గ్రామానికి చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎఎస్ఐ) శిశుపాల్ సింగ్, హర్యానాలోని మహేంధ్రగఢ్ జిల్లా పైగా గ్రామానికి చెందిన ఎఎస్ఐ శివలాల్, బీహార్‌లోని రోహ్తాస్ జిల్లా సరయ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ ధర్మేంద్ర కుమార్ సింగ్‌గా గుర్తించారు. ఇదే దాడిలో మరికొందరు జవాన్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
నౌపడ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన పటధరకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది.