Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో మరోమారు కొత్త కేసులు పెరిగాయి. మంగళవారం రోజు 10 వేల దిగువకు రోజువారీ కేసులు నమోదు కాగా.. బుధవారం మళ్లీ 12 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం నాటికి గడిచిన 24 గంటల్లో 3.10 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా.. 12,249 మంది కోవిడ్ బారిన పడ్డారు. వీటిలో సగానికి పైగా మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చినవే. మంగళవారం 13 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4.32 కోట్లకు పైమాటే. గడిచిన 24 గంటల్లో 9,862 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 81,687 క్రియా శీలక కేసులున్నాయి. పాజిటివిటి రేటు 3.94 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 98.60 శాతానికి తగ్గింది. క్రితం రోజు 12.28 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 196 కోట్లకు పైగా డోసులు వినియోగమయ్యాయి.