Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు భాగస్వామ్యం కావాలి: సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో కాంట్రాక్టీకరణ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 24న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. 'జై జవాన్ జై కిసాన్' నినాదంతో జిల్లాలు, తహసీల్, బ్లాక్ హెడ్‌క్వార్టర్స్‌లో శాంతియుత ప్రదర్శనలు నిర్వహించిన తర్వాత రాష్ట్రపతి, సాయుధ దళాల సుప్రీం కమాండర్‌కు మెమోరాండం సమర్పించాలని తెలిపింది. ఆందోళనల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది. అగ్నిపథ్ పథకం రైతులపై ప్రతీకారం తీర్చుకోవడానికి మరో ఎత్తుగడ ఎస్కేఎం విమర్శించింది. అన్ని విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలకు, రాజకీయపార్టీలు నిరసనల్లో భాగస్వామ్యం కావాలని పిలుపు ఇచ్చింది. ఈ మేరకు ఎస్‌కెఎం నేతలు దర్శన్ పాల్, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లేవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ శర్మ (కాక్కాజీ), యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా యువత దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలకు సంయుక్త కిసాన్ మోర్చా మద్దతు ప్రకటించారు. నిరసనలను శాంతియుతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. 'జై జవాన్.. జై కిసాన్' నినాదం స్ఫూర్తిని నాశనం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని విమర్శించారు. జాతీయ భద్రత, నిరుద్యోగ యువత కలలతో ఆటలాడడమే కాకుండా దేశంలోని రైతు కుటుంబాలతో కూడా ఆటలాడుతుందని పేర్కొన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అనే హామీతో మాజీ సైనికోద్యోగులను మోసం చేసిన ప్రధాని మోడీ, ఇప్పుడు నో ర్యాంక్ నో పెన్షన్ పథకాన్ని ప్రారంభించడం దేశానికే సిగ్గుచేటని విమర్శించారు.