Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖంపై ఉమ్మేసి దాడి
- యూపీలో ఘటన
లక్నో : జోమాటో డెలివరీ బాయ్ దళితుడంటూ ఫుడ్ నిరాకరించడంతో పాటు ఓ వ్యక్తి అతని పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన యూపీలో జరిగింది. డెలివరీ బాయ్ ముఖంపై ఉమ్ము వేయడంతో పాటు అతనిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం... ఈ నెల 18న ఆషియానా ప్రాంతం సెక్టార్ హెచ్ నుంచి అభయ్ సింగ్ ఫుడ్ డెలివరీ చేయాలంటూ జోమాటోకు ఆర్డర్ ఇచ్చారు. వినీత్ కుమార్ అనే వ్యక్తి ఆ ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అక్కడికి చేరుకోగానే అభయ్ సోదరుడు అజయ్ ఇంటి నుంచి బయటకు వచ్చి డెలివరీ బాయ్‌ని పేరు చెప్పమని అడిగాడు. పేరు చెప్పగానే.. పసి కమ్యూనిటీకి చెందిన వాడివా ఎస్సీకి చెందిన వ్యక్తి అంటూ కులం పేరుతో దూషించడం ప్రారంభించాడు. ఒక దళితుడు తీసుకువచ్చిన ఆహారాన్ని తాను తీసుకోనంటూ నిరాకరించి వినీత్ ముఖంపై ఉమ్ము వేశాడు. అవసరం లేకపోతే ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసుకోవాలనీ, ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని వినీత్ పేర్కొన్నాడు. వెంటనే సుమారు 12 మంది అజయ్ ఇంటి నుంచి బయటకు వచ్చి వినీత్‌ను తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు. తలపై తీవ్రంగా కొట్టారనీ, అయితే హెల్మెట్ ధరించి ఉన్నందున తలకు గాయం కాలేదని వినీత్ పేర్కొన్నారు. అనంతరం వినీత్ బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అజయ్ సింగ్, వివేక్ శుక్లాలను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే జమాటో డెలివరీ బాయ్ పై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. 2019 జులైలో మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఇదే తరహా ఘటన జరిగింది. డెలివరీ బాయ్ హిందూ యేతరుడు కావడంతో ఆ ఫుడ్ తీసుకునేందుకు అమిత్ శుక్లా వ్యతిరేకించాడు. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోకపోగా, నగదు కూడా చెల్లించలేదు.