Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్ ప్రతిపక్షం మహాఘట్బంధన్ డిమాండ్
- కేంద్రం పథకానికి వ్యతిరేకంగా రాజ్‌భవన్‌కు నిరసన ర్యాలీ
- పాల్గొన్న వామపక్ష, ఆర్జేడీ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
పాట్నా : మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద అగ్నిపథ్‌పై బీహార్ ప్రతిపక్షం మహాఘట్బంధన్ ఆందోళనకు దిగింది. ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ), వామపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. బీహార్ విధాన సభ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి ఆర్జేడీ నాయకుడు, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ నేతృత్వం వహించారు. ర్యాలీ అనంతరం రాష్ట్ర గవర్నర్‌కు మెమోరాండంను అందజేశారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ ఎమ్మెల్సీ అయిన రబ్రీదేవీ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) పార్టీలకు చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనలో భాగస్వామ్యమయ్యారు. అయితే, మహాఘట్బంధన్లో భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రం ఈ నిరసన ర్యాలీకి దూరంగా ఉండటం గమనార్హం.
'అగ్నిపథ్.. సంఫ్‌ు రహస్య అజెండా'
అగ్నిపథ్ పథకమనేది బీజేపీ, ఆరెస్సెస్ 'రహస్య అజెండా' అని తేజస్వీ అన్నారు. ఈ పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. '' ఈ పథకం దేశ ప్రయోజనం కోసం కాదు. అగ్నిపథ్ పథకం సంఫ్‌ు అజెండా కోసం రూపిందించినట్టు కనిపిస్తున్నది'' అని తేజస్వీ ఆరోపించారు. ''పథకానికి వ్యతిరేకంగా యువతతో కలిసి మహాఘట్బంధన్ నిరసన చేస్తున్నది. మేము 'గల్లీ నుంచి పార్లమెంటు వరకు' పోరాడుతాం'' అని తేజస్వీ యాదవ్ అన్నారు.
'బీజేపీ నాయకుల పిల్లలను అగ్నివీర్లుగా చేయాలి'
బీజేపీ నాయకులు తమ పిల్లలను 'అగ్నివీర్' లుగా తయారు చేయాలని తేజస్వీ సవాల్ విసిరారు. అలా చేస్తే నాలుగేండ్ల తర్వాత వారికి ఆర్జేడీ రూ. 24 లక్షలు అందించి తమ పార్టీ కార్యాలయం వద్ద ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నప్పటికీ భారత ప్రధాని మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లు దీనిపై మౌనంగా ఉండటాన్ని తేజస్వీ ప్రశ్నించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న నిరసనకారులందరిపై ఉన్న కేసులను వెనక్కి తీసుకోవాలనీ, జైలుకు వెళ్లిన వారిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా గత కొన్ని రోజుల నుంచి బీహార్‌లో తీవ్ర నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆందోళనల్లో పాల్గొన్నవారికి వ్యతిరేకంగా 161 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయనీ, 922 మందిని అరెస్టు చేశామని బీహార్ ఏడీజీ జేఎస్ గంగ్వార్ వెల్లడించారు.