Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాతావరణ మార్పులపై నిధులివ్వటంలో విఫలం
- అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల దారి మళ్లింపు
- అభివృద్ధి చెందుతున్న, చిన్న దేశాలపై తీవ్ర ప్రభావం
- సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించలేకపోతున్న దుస్థితి
కొచ్చి : వాతావరణ మార్పులను ఎదుర్కోవటం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సాయం అందించే విషయంలో సంపన్న దేశాలు మాటలకే పరిమితమయ్యాయి. పలు వేదికల్లో వాగ్దానాలను చేసినప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్త, అదనపు నిధులు ఇవ్వలేదు. ఈ విషయం తాజా నివేదికలో వెల్లడైంది. బదులుగా, అభివృద్ధి చెందిన దేశాలు.. అభివృద్ధి కోసం ఉద్దేశించిన నిధులను (పేదరిక నిర్మూలనతో పాటు పలు అంశాలు) వాతావరణ కారణాల కోసం మళ్లించాయి. దీంతో అభివృద్ధి లక్ష్యాలను సాధించటంలో చిన్న, అభివృద్ధి చెందుతున్న దేశాలు చతికలపడుతున్నాయని శాస్త్రవేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
భారీ మొత్తంలో నిధుల మళ్లింపు
క్లైమేట్ చేంజ్ అండ్ రెసిలెన్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (కేర్) తాజా నివేదిక ప్రకారం.. ఈ దేశాలు ఈ విధంగా 103 బిలియన్ డాలర్లు ( ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పైగా) మళ్లించాయి. ఇది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సాధించటంలో నిధులు దూరం కావటం సమస్యగా మారింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ ఆర్థిక సాయం (క్లైమేట్ ఫైనాన్స్) ఆవశ్యకతను భారత్ పదే పదే ఎత్తి చూపుతున్నది. అభివృద్ధి చెందిన దేశాలు వాగ్దానం చేసినట్టుగా కొత్త నిధులను పంపిణీ చేయకపోవటం ''ఆశ్చర్యకరం'' అని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణ ఆర్థిక సాయంను తిరిగి ట్రాక్‌లో ఉంచటానికి ''కొత్త, అదనపు'' ఫండ్స్ అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనాలను ఏర్పాటు చేయడంతో సహా అనేక దశలను నివేదిక సిఫారసు చేసింది.
క్లైమేట్ ఫైనాన్స్
వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ (యూఎన్ఎఫ్సీసీసీ) ప్రకారం క్లైమేట్ ఫైనాన్స్ అనేది పబ్లిక్, ప్రయివేటు, ప్రత్యామ్నాయ వనరుల నుంచి సేకరించిన నిధులు. ఇది వాతావరణ మార్పులను పరిష్కరించటానికి ఉపశమన, అనుసరణ చర్యలకు మద్దతునిస్తుంది.
2009లో కాప్15 వద్ద అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2020 నాటికి వంద బిలియన్ డాలర్లు (దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు) అందజేస్తామని వాగ్దానం చేశాయి. ఇది 2023కి ముందు సాధ్యమయ్యే అవకాశం కనిపించటం లేదని నిపుణుల అంచనా. గతేడాది కాప్26లో క్లైమేట్ ఫైనాన్స్ డెలివరీ ప్లాన్‌ను ఆవిష్కృతమైంది. ఈ క్లైమేట్ ఫైనాన్స్‌ను అందించటానికి ఒక అజెండా, టైమ్‌టేబుల్ రూపుదిద్దుకున్నది. దీని ప్రకారం సంపన్న దేశాలు 2025 వరకు ప్రతి ఏడాదీ అంతే మొత్తాన్ని అందించాలి.
అనేక అవాంతరాలు
అయితే, గ్లోబల్ క్లైమేట్ ఫైనాన్స్ వెనకంజంలో ఉన్నది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రచురించబడిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) తాజా క్లైమేట్ రిపోర్ట్ ఫైనాన్స్‌లో అనేక అంతరాలను కనుగొన్నది. ఒకటి.. వాతావరణ మార్పుల అనుసరణ, ఉపశమనాల కంటే శిలాజ ఇంధనాల కోసం ప్రభుత్వ, ప్రయివేటు ఫైనాన్స్ చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నది. మరొకటి.. క్లైమేట్ ఫైనాన్స్ ప్రస్తుతం ఉపశమనంపై ఎక్కువగా దృష్టి సారించింది. ''పారిస్ ఒప్పందం లక్ష్యాల వైపు ఆర్థిక ప్రవాహాల అమరికపై పురోగతి నెమ్మదిగా ఉన్నది. వాతావరణ నిధులు.. అనేక ప్రాంతాలు, రంగాలలో అసమానంగా పంపిణీ చేయబడ్డాయి'' అని నివేదిక పేర్కొన్నది. సంపన్న దేశాలు 2020 నాటికి వాతావరణ ఆర్థిక లక్ష్యాన్ని సాధించలేకపోయాయని నిర్ధారించటం గమనార్హం.
వాగ్దానాల ఉల్లంఘన
యూఎన్ఎఫ్సీసీసీ కి నివేదించబడిన క్లైమేట్ ఫైనాన్స్‌పై సమాచారాన్ని విశ్లేషిస్తే.. కేర్.. 23 అభివృద్ధి చెందిన దేశాలు (యునైటెడ్ స్టేట్స్ వంటి జీ7 దేశాలతో సహా) 2011-18 మధ్య అందించిన నిధులలో ఆరు శాతం (14 బిలియన్ డాలర్లు) మాత్ర మే అభివృద్ధి చెందిన దేశాల అధికారిక అభివృద్ధి సహాయక లక్ష్యాలకు కేటాయించిన 'కొత్త, అదనపు నిధులు'. కేవలం మూడు దేశాలు లక్సెంబర్గ్, నార్వే, స్వీడన్ లు స్థిరంగా ఈ నిబద్ధతను అధిగమించాయి.
2009లో సంపన్న దేశాలు చేసిన 'అతి' వాగ్దానంకు విరుద్ధంగా.. క్లైమేట్ ఫైనాన్స్‌గా తక్కువ మొత్తాన్ని మాత్రమే అందించాయి. ఆందోళనకరమైన విషయమేమిటంటే.. ఎనిమిదేండ్ల కాలంలో ధనిక దేశాలు నివేదించిన వాతావరణ ఆర్థిక వాటా మరిం త తగ్గింది. అభివృద్ధి కోసం ఉద్దేశించిన నిధులను క్లైమేట్ ఫైనాన్స్ వైపు మళ్లించటం ఆందోళన కలిగిస్తు న్నది. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎస్డీజీలను సాధించటానికి తక్కువ నిధులు అందుబాటులో ఉంటాయి. దీంతో అభివృద్ధి చెందు ున్న దేశాలకు వాతావరణ ఫైనాన్స్‌లో 100 బిలియన్ డాలర్లను అందించటానికి అభివృద్ధి చెంది న దేశాలు తమ బాధ్యతలను గుర్తెరగాలని నివేదిక సిఫారసు చేసింది. దానిని అభివృద్ధి నిధులతో కల్పకూడదని సూచించింది.
ఆ దేశాలపై ప్రభావం
అభివృద్ధిచెందిన దేశాల వైఫల్యం ఏ మాత్రమూ ఆశ్చర్యం కలిగించటం లేదని ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సీనియర్ ఫెలో, వాతావరణ శాస్త్రవేత్త టీ. జయరామన్ అన్నారు. అధికారి అభివృద్ధి సాయంలో స్పష్టమైన తగ్గుదల భారత్‌పై మాత్రమే కాకుండా.. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల పైనా 'దుష్ప్రభావం' చూపుతుందని చెప్పారు. చిన్నదేశాలపై దీని ప్రభావం ఇంకా అధికంగా ఉంటుందన్నారు.